2 June, 2026 | 12:49 AM

సిరిసిల్ల-హైదరాబాద్ అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని కలెక్టర్‌కు వినతి

02-06-2026 12:49 AM

సిరిసిల్ల, జూన్1,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతూ బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ సోమవా రం జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సిరిసిల్ల నుండి ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, రోగులు,సాధారణ ప్రజలు హైదరాబాద్కు ప్రయాణిస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం న డుస్తున్న ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల రద్దీకి సరిపోవడం లేదని, ముఖ్యంగా వేములవాడ నుంచి వచ్చే బస్సులు ఇప్పటికే నిండిపోయి సిరిసిల్లకు చేరుకోవడంతో స్థానిక ప్రయాణికులకు సీట్లు దొరక డం లేదని పేర్కొన్నారు. దీంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని అన్నారు.

అందువల్ల సిరిసిల్ల డిపో నుంచి హైదరాబాద్కు అదనపు బ స్సులను కేటాయించడంతో పాటు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రద్దీ సమయాల్లో ప్రత్యేక సర్వీసులు నడిపించాలని కలెక్టర్ను కోరారు. ప్రజల అవసరాలను దృ ష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ నాయకులు మట్ట శ్రీనివాస్, బైకని వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.