2 June, 2026 | 1:18 AM

మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సామ్యూల్ బెన్డిక్ట్ ఇస్రాయిల్ పాల్

02-06-2026 12:48 AM

మధిర, జూన్1 (విజయక్రాంతి): మధిర నూతన కమిషనర్ గా సోమవారం బాధ్యతలు చేపట్టిన సామ్యూల్ బెన్టిక్ట్ ఇస్రాయిల్ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాతను ఇల్లిందలపాడు గ్రామంలో స్వయంగా పూల బొకేతో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ సామినేని సుజాతను మున్సిపాల్టీలో ఉన్న సమస్యలను జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

మధిర మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయలు నిధులతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అండర్ డ్రైనేజీ వర్కుతొ పాటు మధిర మున్సిపాలిటీ లో జరుగుతున్న అనేక కార్యక్రమ వివరాలను చైర్మన్ ను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత మధిర మున్సిపాలిటీలో జరిగే ప్రతి కార్యక్రమం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆశయాలకు అనుగుణంగా ఉండాలని కోరారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా చూడాలని కోరారు. మున్సిపాలిటీలో జరిగే ప్రతి పని పారదర్శకంగా ఉండాలని కోరారు.దీనికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ మధిర మున్సిపాలిటీ అభివృద్ధిలో తగు పాత్ర పోషిస్తానని చైర్ పర్సన్ కు హామీ ఇచ్చారు.