వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని మంత్రికి వినతి
ఘట్ కేసర్, మే 4 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ సోమవారం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం అందజేసి కోరారు. రైల్వే వంతెన పూర్తి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించాలని కోరుతూ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుని ఆయన నివాసంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ కలిశారు.
వంతెన నిర్మాణం పనులు చూస్తున్న కాంట్రాక్టర్ కు ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు రూ. 4 కోట్లు బిల్లు మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిధులు మ ంజూరు అయ్యేవిధంగా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలో ఈ సమస్య పై చర్చించి నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పినట్లు మాజీ చైర్మన్ పావని యాద వ్ తెలిపారు. ఈసందర్బంగా మంత్రి శ్రీధర్ బాబుకి, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
నిర్లక్ష్యం చేస్తే పార్టీకి రాజీనామా
రైల్వే వంతెన నిర్మాణ పనుల్లో మరోసారి నిర్లక్ష్యం వహిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీ నామాలు చూస్తామని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా అధ్యక్షలు తోటకూర వజ్రేష్ యాదవ్ నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.
అక్కడ నుండి తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేరుకుని ఆయనతో మాట్లాడి వంతెన నిర్మాణ సాధన కోసం ఈనెల 11వ తేదీన ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు ముందుగానే నిధులు విడుదల చేసి రైల్వే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనా మాలు చేస్తామని మంత్రికి తెలపడం జరిగింది.
మాజీ సర్పంచ్ డక్కి రమేష్, మాజీ కౌన్సిలర్లు కడపోల్ల మల్లేష్, కుతాడి రవీందర్, ఈ డబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షలు కేశవపట్నం అంజనేయులు, కార్యదర్శి శశిధరన్, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్, వి.బి. వెంకటనారాయణ, నాయకులు ఖయ్యూo, సార శ్రీనివాస్ గౌడ్, శివరాత్రి సురేష్, తన్నీర్ హరీష్, తదితరులు పాల్గొన్నారు.






