14 April, 2026 | 4:18 AM

వీధిదీపాలు ఏర్పాటు చేయాలని వినతి

14-04-2026 01:01 AM

మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్ లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని బిజెపి మాజీ అధ్యక్షుడు కొండం ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మేడ్చల్ సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ డి ఈ కి వినతిపత్రం అందజేశారు. వీధి దీపాలు లేక గిర్మాపూర్ లో అంధకారం ఏర్పడిందని తెలిపారు.

అంతేగాక సిసి రోడ్డు మీద గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందిగా తయారందని తెలిపారు. మేడ్చల్ పట్టణంలో గ్రంథాలయం వద్ద రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బొక్క అంజిరెడ్డి, బండి విష్ణు గౌడ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బి రాఘవరెడ్డి, రాగం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.