15 April, 2026 | 4:15 AM

రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు విన్నపం

29-12-2025 01:26 AM

ములకలపల్లి, డిసెంబర్ 28 (విజయక్రాంతి): తాళ్లపాయి పంచాయతీకి నూతన రేషన్ షాప్ మంజూరు చేయాలని అశ్వారావుపేట  ఎమ్మెల్యే జారే ఆదినారాయణను తాళ్లపాయి పంచాయతీ సర్పంచ్ గడ్డం సు జాత కోరారు. ఆదివారం ఎమ్మెల్యేను దమ్మపేట మండలంలోని గండుగులపల్లిలోని ఆ యన స్వగృహంలో కలిసి తాళ్లపాయి పం చాయతీలో నెలకొన్న సమస్యలను ఆయనకు వివరించారు.తాళ్లపాయి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు విద్యుత్ లైన్, తాగునీటి సౌక ర్యం కల్పించాలని కోరారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జారే విద్యుత్ ఏఈ కి ఫోన్ చేసి జనవరి నెలలో విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాళ్ళాపాయి డబు ల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాగునీటి సౌకర్యం క ల్పిస్తానని, తాళ్లపాయి  పంచాయతీకి నూ తన రేషన్ షాప్ మంజూరు చేయిస్తానని హా మీ ఇచ్చారు.అనంతరం సర్పంచ్ గడ్డం సుజాతను,ఉప సర్పంచ్ కొండ్రు అనూషను శాలువతో ఎమ్మెల్యే సన్మానించారు. వీరితో పాటు వార్డ్ మెంబర్ మడకం రమేష్, సోడే సాయి, గడ్డం ఉదయ్ తదితరులు ఉన్నారు.