15 April, 2026 | 5:46 AM

దేశానికి కాంగ్రెస్ శ్రీరామరక్ష

29-12-2025 01:25 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, డిసెంబర్ 28 (విజయ క్రాంతి): దేశానికి కాంగ్రెస్ పార్టీనే శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ  కాంగ్రెస్ పార్టీ అని,

నిరు పేదలకు బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ దేశానికి నాడైనా, నేడైనా కాంగ్రెస్ పార్టీనే శ్రీరామ రక్ష అని, ఈ దేశానికి రాహుల్ గాంధీ ని ప్రధాని చేసి దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

చిట్యాల, డిసెంబర్ 28(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దకాపర్తి గ్రామంలో సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఆదివారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో  కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కాటo  వెంకటేశం  జెండాన్ని ఆవిష్కరించగా,  ఉపసర్పంచ్ వరుసు సైదులు కొబ్బరికాయ కొట్టి, పార్టీ త్యాగదనులను, నాయకులను స్మరించుకుంటూ నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏర్పుల యాదయ్య, ఏర్పుల వెంకన్న, సాగర్ల నాగరాజు, ఆనగంటి నరేష్, నూతి వెంకటేశం, బైరవని భిక్షం, జిల్లా నరసింహ, గుండబోయినరసింహ, ఓర్సు కృష్ణ, పొట్లపల్లి లింగస్వామి, కురు ఈదయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే

 ఆలేరు, డిసెంబర్ 28 (విజయక్రాంతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య  అన్నారు. కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలేరు పట్టణంలోని ఇందిరా భవనంలో  పార్టీ జెండా ఆవిష్కరించారు, అనంతరం ఏఐసీసీ, పీసీసీ పిలుపుమేరకు బీజీపీ వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసిసి అధ్యక్షుడు బీర్ల అయిలయ్య  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 

ఆలేరు పట్టణ కేంద్రంలోని ఇందిరా భవనం నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి మహాత్మ గాంధీ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు, తదుపరి బీర్ల అయిలయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవోనాపాధికై 2005 లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం  మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని తెచ్చిందన్నారు. మోదీ హయాంలో ఎన్డీయే ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశానికి తూట్లు పొడుస్తూ పేద ప్రజల పొట్ట కొట్టేలా విబిజి రాంజీ వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఔర్ అజ్విక మిషన్ పథకాన్ని తెచ్చిందన్నారు.

ఈ పథకాల్లో గాంధీజీ పేరును తొలగిస్తారేగాని బారత దేశ పేదప్రజల గుండెల్లో గాంధీజీ ఎప్పుడు ఉంటారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని గాంధీ కుటుంబం పై క్షక్ష సాదిచటంకోసం మోడీ, అమిత్ సహా చూస్తున్నారని బీర్ల అయిలయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, ఎంఏ ఎజాజ్, నీలం పద్మ, వెంకటస్వామి, విజయ్ కుమార్, ఎగ్గిడి శ్రీశైలం పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అర్వపల్లిలో 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),డిసెంబర్28: సామాజిక న్యాయం,సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ నాటినుండి నేటి వరకు కట్టుబడి ఉందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యంలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ141వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రం అర్వపల్లిలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని,ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంత పోరాటంతోనే దేశానికి స్వాతంత్రం,తెలంగాణ రాష్ట్రం సాధించగలిగామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధకిషన్ రావు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్, ఉపాధ్యక్షుడు పెసర సతీష్ రెడ్డి,దేవస్థానం డైరెక్టర్లు బీరెళ్లి శ్రీధర్ రెడ్డి, సోమయ్య,సర్పంచులు బింగి కృష్ణమూర్తి,చిల్లంచర్ల విద్యాసాగర్ నాయకులు మేకల రాంబాబు, మామిడి శ్రీనివాస్,బైరబోయిన సైదులు, మహారాజు, బొడ్డు రమేష్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ సేవలు స్ఫూర్తిదాయకం

మునుగోడు, డిసెంబర్ 2౮ (విజయక్రాంతి): దేశ ప్రగతికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు అన్నారు. ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మునుగోడు మండల కేంద్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరికి కాంగ్రెస్ పార్టీ 140 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత దేశ ప్రజలకు అండగా 140 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని, గాంధీ నేతృత్వంలో స్వంతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ భారత ప్రధానులుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, గ్రామాలలోని ప్రతి పేద ఇంటికి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రమే అందాయన్నారు.

పది సంవత్సరాల బీజేపీ పాలనలో దేశంలో కులాలు, మతాల ప్రాతిపదికన పాలన సాగిస్తుందన్నారు. పేద ప్రజల ఉపాధి కోసం ప్రారంభించిన పథకాలకు మహాత్మా గాంధీ పేరును బిజెపి ప్రభుత్వం తొలగిస్తుందని పేరు తొలగించినంత మాత్రాన ప్రజల నుంచి గాంధీ ని దూరం చేయలేరని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లాయూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి, పాల్వాయి జితేందర్ రెడ్డి, పందుల భాస్కర్, పందుల యాదయ్య ,కుంభం చిన్నారెడ్డి, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

స్వాతంత్ర పోరాటంలో కీలకం

హుజూర్ నగర్, డిసెంబర్ 28: భారత దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు అన్నారు.ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం భారీ కేకును కట్ చేసి పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున్ రావు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల సమాన న్యాయం కోసం సమానత్వం కోసం ఆనాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేసిందని అన్నారు. దేశ ప్రజల కోసం జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గెల్లి రవి,సాముల శివారెడ్డి,దొంగరి వెంకటేశ్వర్లు, అజిజ్ పాష,దొంతగాని శ్రీనివాస్, కోతి సంపత్ రెడ్డి,మన్సూర్ అలీ, వల్లపుదాసు కృష్ణ, షేక్ సైదా, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్

సూర్యాపేట, డిసెంబర్28  (విజయక్రాంతి): దేశంలో ప్రజలను ఐక్యం చేసి,బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం  తేవడంలో కీలక పాత్ర పోషించడంతోపాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు.ఆదివారం భారత జాతీయ కాంగ్రెస్141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(రెడ్ హౌస్)లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం పోరాటం వారి భవిష్యత్తు,ప్రజల అభివృద్ధి,సంక్షేమం,సామాజిక న్యాయం,సమానత్వంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశాన్ని,రాష్ట్రాన్ని ప్రజాపాలనతో ముందుకు నడిపిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్  అన్నారు.  ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

చిట్యాలలో 

చిట్యాల,డిసెంబర్ 28(విజయ క్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణ కాంగ్రెస్ నాయకుల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిట్యాల కనకదుర్గ సెంటర్ లో కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలు భారత భూమి ఎన్నడు మరువలేవని, జాతీయ నాయకులను గుర్తు  చేసుకుంటూ వారి యొక్క ఆశయాలు నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరు అడుగు వేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం గత 45 సంవత్సరాలుగా  దీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు పోకల దేవదాసుని, మేడిశెట్టి ఉమాశంకర్ ను  చిట్యాల పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కనకదుర్గ ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, మాజీ వార్డ్ కౌన్సిలర్లు సిలువేరు శేఖర్, బెల్లి సత్తయ్య , వనమా వెంకటేశ్వర్లు , జడల చిన్న మల్లయ్య, ఎస్కే ఇబ్రహీం, బొబ్బలి రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

కోదాడలో

కోదాడ, డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు లు అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ  141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలో పలుచోట్ల వేడుకల్లో భాగంగా పార్టీ జెండాలు ఆవిష్కరించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి నాయకులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజే శారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి,  సీనియర్ తూనం కృష్ణ, పత్తిపాక జనార్ధన్, బాబా, సుందరి వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ రెడ్డి, గద్దె రఘు పాల్గొన్నారు.