29 August, 2026 | 2:28 PM

రోడ్డు వెడల్పు తగ్గించాలని ఎమ్మెల్యే, సర్పంచ్‎లకు వినతి

29-08-2026 01:27 PM

గణపురం,ఆగస్టు 29 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రంలోని పరకాల ములుగు ప్రధాన రహదారితోపాటు  కోట గుళ్ళకు వెళ్లే రహదారి రోడ్డు వెడల్పు తగ్గించాలని శనివారం రహదారి వెంట ఉన్న షాపు యజమానులు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ లకు వినతి పత్రం అందజేశారు.

గతంలో ఇచ్చిన మాట ప్రకారం పరకాల, ములుగు రహదారి 100 ఫీట్ల నుండి 80 ఫీట్లకు తగ్గించాలని అదేవిధంగా కోట గుళ్ళకు వెళ్లే రహదారి వెడల్పు 52 ఫీట్ల నుండి 40 ఫీట్లకు తగ్గించాలని వినతిలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాట్లాడుతూ ఎవరికి ఇబ్బంది లేకుండా రోడ్డు వెడల్పు పనులు చేపడతామని అన్నారు అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తమ అభిప్రాయాలను తెలుపాలని ఈ సందర్భంగా వారన్నారు.