29 August, 2026 | 2:57 PM

మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో రెండు హత్యలు

29-08-2026 02:25 PM

 గత పది సంవత్సరాలుగా వేపచెట్టు వివాదం హత్యకు కారణం

 మేళ్లచెరువు ఆగస్టు 29(విజయ క్రాంతి): మేళ్లచెరువు మండల పరిధిలోని ఎర్రగట్టు తండా గ్రామంలో రెండు కుటుంబాల గోడల మధ్య ఉన్న వేప చెట్టు వివాదం చిలికి చిలికి రెండు హత్యలకు దారితీసింది.. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఎర్రగట్టు గ్రామానికి చెందిన భూక్య సైదా, అమరబోయిన వెంకటేశ్వర్లకు గత పది సంవత్సరాల నుండి ఇరు కుటుంబాల మధ్య ఉన్న వేపచెట్టు వివాదం జరుగుతోంది.

ఈ వేప చెట్టును గ్రామస్తులందరూ దేవుడి చెట్టుగా పూజించటంతో వివాదం జఠలమైంది. శుక్రవారం భూక్య సైదా ఇంటి నుండి వేపచెట్టు అమరబోయిన వెంకటేశ్వర్లు ఇంటి మీదికి పడిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రెండు కుటుంబాల మధ్య చిన్న ఘర్షణ తలెత్తడంతో భూక్య సైదా పెద్ద కుమారుడైన భూక్య పెదబాబు మరొక కుమారుడు రాము ఇద్దరూ కలిసి అక్కడే ఉన్న అమరబోయిన వెంకటేశ్వర్లపై గొడ్డలితో దాడి చేశారు. వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు.వెంటనే భూక్య పెదబాబు తన తండ్రి అయిన భూక్య సైదాపై కూడా గొడ్డలితో దాడి చేయగా చికిత్స నిమిత్తమై హుజూర్నగర్ కు తరలించగా అక్కడ చనిపోయాడు. 

మేళ్లచెరువు ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇంతలో గ్రామస్తులందరూ భూక్య పెదబాబు. రాములపై దాడి చేస్తున్న సందర్భంలో ఎస్ఐ నవీన్ కుమార్ అడ్డుగా వెళ్లడంతో ఎస్ఐ తలకు  గాయమైంది. దీంతో పోలీస్ బలగాలు ఎర్రగట్టు తండా చేరుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. సంఘటన తెలిసిన వెంటనే కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐలు చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ఎస్సైలు నవీన్ కుమార్ పరమేష్ నరేష్  లతోపాటు పోలీస్ బ లగాలు చేరుకున్నాయి.

కాగా ఈ హత్య కేసులో నిందితుడైన భూక్య పెదబాబు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి  ఇటీవల సస్పెండ్ కు గురయ్యారు. గ్రామంలో అందర్నీ బెదిరిస్తూ కేసులు పెడుతుంటాడని, సైకోలా ప్రవర్తిస్తుంటాడని  గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో పోలీస్ ఫిట్టింగ్ నడుస్తుంది. కేసు విషయంలో నిందితుల్ని అదుపులోకి తీసుకొని   విచారణ జరుపుతున్నట్లు కోదాడ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.