calender_icon.png 19 February, 2026 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించాలని వినతి

19-02-2026 12:12:09 AM

మేడ్చల్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కలెక్టర్ మను చౌదరికి విన్నవించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

మౌలాలి, గౌతమ్ నగర్ డివిజన్లోని ఏకలవ్య నగర్ ప్రాంతంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని, వినాయక్ నగర్ డివిజన్ సఫిల్ గూడాలో ఇప్పటికే కేటాయించిన ప్రభుత్వ భూమికి బదులుగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోరారు. యాప్రాల్ లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థలాన్ని రక్షిస్తూ దానిని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని, బ్రాహ్మణ సంఘానికి స్థలం కేటాయించాలని కోరారు.

నేరేడ్మెట్, రామకృష్ణాపురం, అంతయ్య కాలనీలలో ఉన్న కమ్యూనిటీ స్థలాలను పరిరక్షించాలని, ఆల్వాల్ పరిధిలోని భూదాన్ భూముల్లో స్టేడియం, క్రీడ మైదానాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని విన్నవించారు. ఆర్కే పురం ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ప్రభావితమవుతున్న, ఆర్మీ భూముల్లో ఎన్నో ఎల్లువ నివసిస్తున్న పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపన కోసం తగిన స్థలం కేటాయించాలని, ఏఓసి అదనపు రోడ్డు నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు బి ఆర్ ఎస్ నాయకులు కలెక్టర్ ను కలిశారు.