19-02-2026 12:14:24 AM
మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని మేడ్చల్ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ బాసురాధి భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా పనిచేసిన మీరు మరింత ఘాటుగా పనిచేయాలని మాజీ సీఎం సూచించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.