10-06-2025 11:17:10 PM
కొత్తకోట: కొత్తకోట మున్సిపాలిటీలో ఉన్న వివిధ అభివృద్ధి పనుల నిలిపివేతపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య(Bakki Venkataiah)కు కొత్తకోట బీజేపీ నాయకులు భరత్ భూషణ్ వినతిపత్రం అందజేశారు. మంగళవారం వనపర్తికి వచ్చిన సందర్బంగా ఆయనను కలిసి కొత్తకోట మున్సిపాలిటీ గురుంచి వివరించారు. 2023లో టి. యు. ఎఫ్. ఐ. డి. సి. నిధుల కింద కోటి 30 లక్షల రూపాయలతో కొత్తకోటకు అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణం గురించి మంజూరి అయినవి.
అదే సంవత్సరంలో దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేసి శిలాఫలకం వేయడం జరిగిందని వివరించారు. రెండు సంవత్సరాలు కావస్తున్న ఈ పనులు ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభించడం లేదు. వివాహాది శుభకార్యాలు చేసుకొనుటకు పట్టణ ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కావున మంజూరీ అయినా ఈ నిధుల ద్వారా తక్షణమే అంబేద్కర్ ఆడిటోరియం నిర్మించుట కొరకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ కు వినతిపత్రం అందజేశారు.