17 April, 2026 | 10:00 AM

ఓబుళాపురం మైనింగ్ కేసు తీర్పు నేడు

11-06-2025 12:00 AM
  1. గాలి, ఓఎంసీ పిటిషన్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు..
  2. మిగిలిన నిందితుల పిటిషన్లపై విచారణ 17కు వాయిదా 

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ఓబుళాపురం మైనింగ్ కేసులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం తెలంగాణ హైకో ర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

సీబీఐ కోర్టు తీర్పుపై తమ కు అభ్యంతరాలు ఉన్నాయని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు పిటిషనర్లు గాలి జనార్దన్‌రెడ్డి, ఓఎంసీ కంపెనీపై వాదనలు పూర్తయ్యాయి. బుధవారం తీర్పు వెల్లడిస్తామని జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. మిగిలిన నిందితుల పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని బెంచ్ సీబీఐని ఆదేశించింది. వి చారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.