17 April, 2026 | 10:02 AM

వృద్ధురాలి పట్ల జడ్జి ఉదారత

11-06-2025 12:00 AM

కోర్టు బయటకు వెళ్లి విచారణ

నిర్మల్, జూన్ 10 (విజయక్రాంతి): నిర్మల్ జూనియర్ సివిల్ జడ్జి పీ రవికుమార్ ఓ వృద్ధురాలి పట్ల మంగళవారం తన ఉదారతను చాటుకున్నారు. లక్ష్మణ చందా మండలంలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబ సభ్యుల మధ్య గొడవల నేపథ్యంలో కేసు నమోదయింది. విచారణ నిమిత్తం వృద్ధురాలి సాక్షాన్ని సేకరించేందుకు జడ్జి గది నుంచి బయటకు వచ్చి కిందికి దిగి ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నారు. న్యాయం ప్రజల ముందుకు చేరువవుతుందని ఇటువంటి ఘటనలు రుజువు చేస్తాయి.