పదవి విరమణ పొందిన సింగరేణి అధికారులు
కవితా నాయుడు, నారాయణరావు,
కొత్తగూడెం,(విజయ క్రాంతి): పదవీ విరమణ పొందుతున్న జిఎం(పర్సనల్) ఐఆర్ & పిఎం కవితా నాయుడు, డిజిఎం(పర్సనల్) కేసా నారాయణ రావు కి పర్సనల్ విభాగం ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసింది. సింగరేణి సంస్థ పర్సనల్ డిపార్ట్మెంట్ లో సుమారు 36 సంవత్సరాలపాటు పని చేసి ప్రస్తుతము జిఎం(పర్సనల్) ఐఆర్ & పిఎంగా పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ గావిస్తున్న జనరల్ మేనేజర్(పర్సనల్) ఐఆర్ & పిఎం కవితా నాయుడు, పర్సనల్ డిపార్ట్మెంట్ లో 37 సంవత్సరాల పాటు పని చేస్తూ, పదవీ విరమణ పొందుతున్న డిజిఎం(పర్సనల్) కేసా నారాయణ రావు ని, జిఎం(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్, జిఎం(పర్సనల్) ఈఈ & ఆర్‌సి శ్రీ ఏజే ఎం మురళీధర రావు, వెల్ఫేర్, ఏఈపిఏటిీబి సెల్, ఆర్‌సి, ఐఆర్&పిఎం, ఈఈ సెల్, ఎస్‌ఏపి్ హెచ్‌ఆర్/ ఈఆర్‌పి, కమ్మ్యూనికేషన్, స్పోర్ట్స్, సిపిఆర్‌ఎంఎస్, విభాగాల ఏజిఎం(పర్సనల్), డిజిఎం(పర్సనల్) లు, పర్సనల్ మేనేజర్లు, డివై.పిఎం లు, సీనియర్ పిఓ లు, ఇతర అధికారులు మరియు పర్సనల్ డిపార్ట్మెంట్ల సిబ్బంది సింగరేణి ప్రధాన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నందు 31.07.2026 శుక్రవారమున పూల మాలలతో, శాలువాలతో, జ్ఞాపికలతో ఘనముగా సన్మానించారు.
ఈ సంధర్భముగా వారు మాట్లాడుతూ, జనరల్ మేనేజర్(పర్సనల్) ఐఆర్ & పిఎం కవితా నాయుడు ని పర్సనల్ డిపార్ట్మెంట్ లో వెల్ఫేర్ ఆఫీసర్ నుండి జిఎం పర్సనల్ గా 36 సంవత్సరాల సుధీర్ఘ సర్వీసులో అంకిత భావం, క్రమశిక్షణ, సమయపాలనతో కష్టించి పనిచేశారని కొనియాడారు. ముఖ్యముగా ఈఈ సెల్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ సక్రమముగా నిర్వహించటంలో ఎంతో కృషి చేశారని తెలుపుతూ వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా గడపాలని అన్నారు. అదే విధముగా డిజిఎం(పర్సనల్) కేసా నారాయణ రావు సింగరేణి సంస్థ లో పర్సనల్ డిపార్ట్మెంట్ లో తను పనిచేసిన అన్ని విభాగాలలో అంకిత భావముతో పనిచేశారని, తోటి అధికారుల మరియు ఉద్యోగుల మన్ననలను పొందారని తెలుపుతూ వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా గడపాలని అన్నారు.






