ఉపాధ్యాయురాలికి సన్మానం
31-07-2026 05:32 PM
నిర్మల్,(విజయక్రాంతి): పట్టణంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో పనిచేసిన శకుంతల ఉపాధ్యాయురాలు పదవి విరమణ చేయడంతో శుక్రవారం సన్మానం చేశారు. 38 సంవత్సరాలుగా ఆమె చేసిన సేవలను ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తుకారాం పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు, పిఆర్టియు నిర్మల్ అర్బన్ అధ్యక్షులు బల్స గజ్జరాంగారు మరియు రాంజీ, R జయశ్రీ, దూప్ సింగ్, వాణిశ్రీ, వసంత్ రావు, రామారావు, శిరీష, సుదర్శన్, అశ్విని తదితర పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.






