5 September, 2026 | 7:03 AM

రేవంత్‌రెడ్డీ.. 9వ నిజాంలా మారొద్దు

05-09-2026 | 05:05am
  1. ఒవైసీ బ్రదర్స్ వల్లే హిందూ, ముస్లిం గొడవలు
  2. ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): గతంలో 8వ నిజాం లాగా వ్యవ హరించి మాజీ సీఎం కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) నష్టపోయారని, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కూడా 9వ నిజాం అవుతానంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో గుర్తుంచుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) అన్నారు. ఒవైసీ బ్రదర్స్‌(Owaisi Brothers)ను సీఎం పొగుడుతూ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం ఒక వీడియో విడుదల(video release) చేశారు.

రాజకీయ ప్రశంసల(political praise)కు ముందు ఒవైసీ కుటుంబ రాజకీయ చరిత్రను తెలుసుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్ విష యంలో ఒవైసీ సపోర్ట్‌గా నిలబడ్డాడని అనడంలో అర్థమే లేదన్నారు. ఒవైసీ పాకిస్థాన్ లో ఉంటాడా? భారత్‌లో ఉంటాడా? ప్రతి పౌరుడు భారత్‌కు అండగా నిలబడాల్సిందే అన్నారు. దేశంలో ఒవైసీ బ్రదర్స్ కారణంగానే హిందూ, ముస్లిం కొట్లాటలు నడు స్తున్నాయని విమర్శించారు. 

మరిన్ని వార్తలు