అదానీ- ప్రధాని దేశ పరువు తీశారు..
ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తాకట్టు పెట్టారు
అదానీతో ప్రధానికి ఎలాంటి లాలూచీ ఒప్పందం ఉంది
హైదరాబాద్: ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తాకట్టు పెట్టారు, భారతదేశ గౌరవానికి భంగం కలిగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్ భవన్ సమీపంలో రోడ్డుపై సీఎం రేవంత్ భైఠాయించారు. సీఎంతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా భైఠాయించారు. గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలు, మణిపూర్ లో అల్లర్లపై కేంద్ర వైఖరికి నిరసనగా చలో రాజ్ భవన్ ర్యాలీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... భారత వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని సీఎం ఆరోపించారు. వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా దేశ ప్రతిష్ఠను పెంపొందించిందన్నారు. అదానీ- ప్రధాని కలిసి దేశ పరవును తీశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదానీ సంస్థలు అమెరికాలో అంచాలు ఇవ్వజూపాయని ఆరోపించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలని ఎఫ్ బీఐ నివేదించిందని పేర్కొన్నారు. చట్ట ప్రకారం చర్యలకు అక్కడి ప్రభుత్వం పూనుకుందన్నారు. దేశ పరువును మంటగలిపిన అదానీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదానీపై విచారణకు జేపీసీ నేతృత్వం వహించాని కోరారు. అదానీ అవినీతిపై చర్చకు, జేపీసీ వేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదని చెప్పారు. అదానీతో ప్రధానికీ ఎలాంటి లాలూచీ ఒప్పంది ఉంది.. అదానీని కాపాడేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారు.
జేపీసీ వేయకపోతే రాష్ట్రప్రతిభవన్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. జేపీసీ వేస్తే అదానీ జైలులోకి వెళ్లాల్సి వస్తుందన్నారు. దేశంలో కాకపోతే అమెరికాలోనైనా అదానీకి శిక్ష పడుతుందని సీఎం వెల్లడించారు. సీఎంగా ధర్నా ఎలా చేస్తారని విమర్శలపై రేవంత్ రెడ్డి స్పందించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఇతర నేతలు పాల్గొన్నారు.






