బెల్లంపల్లిలో సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆపాలి
- డీఆర్‌ఎంకు మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి వినతి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్ డీ ఆర్ ఎం గోపాల కృష్ణన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయననూ బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లోప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను నిలిపివేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రత్యేక రైల్లో బెల్లంపల్లికి వచ్చిన సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్‌ను కలిసి పలు సమస్యల్ని తీర్చాలని కోరారు.
దక్షిణ మధ్య రైల్వేకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం అందిస్తున్న బెల్లంపల్లి స్టేషన్‌లో జీటీ, కేరళ, నవజీవన్, హజ్రత్ నిజాముద్దీన్, ఓకాపురి, వందే భారత్ వంటి కీలక రైళ్లను నిలపాలని ఆమె కోరారు. అలాగే స్టేషన్‌లో ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని పూర్తి స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని, ఆర్పీఎఫ్ ఔట్‌పోస్ట్‌ను సర్కిల్ కార్యాలయంగా అప్‌గ్రేడ్ చేసి సిబ్బందిని నియమించాలని విన్నవించారు. వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని, ప్రయాణికుల కోసం ఏటీఎం సౌకర్యం కల్పించాలని కోరారు.
అంతేకాకుడా 10వ వార్డు రైల్వే కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలన్నారు. అందుకు గాను మురుగు కాలువ నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విన్నవించిన సమస్యలపై డీఆర్‌ఎం సానుకూలంగా స్పంచారు. జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డీ ఆర్ ఎం ను కలిసిన వారిలో కౌన్సిలర్లు డీకొండ పద్మ, కాంపల్లి రాజం, కాంగ్రెస్ నాయకులు దావా రమేష్, కంకటి శ్రీనివాస్, డీకొండ రాజలింగు, నెల్లి రమేష్, పోచంపల్లి హరీష్, నీలి కృష్ణ, ఈశ్వర్ ఉన్నారు.






