22 April, 2026 | 8:13 PM

ఎక్కడి బస్సులు అక్కడే.. రోడ్లెక్కని ఆర్టీసీ బస్సులు

22-04-2026 06:37 PM

ప్రయాణికులకు ఇక్కట్లు

సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన సిఐటియు సిపిఐ

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో భాగంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ డిపోకు పరిమితమైన ఆర్టీసీ బస్సులు. వేకువ జాము నుండే ఆర్టీసీ కార్మికులు యాదగిరిగుట్ట డిపో నుండి ఒక్క బస్సు కూడా వెళ్లకుండా గేట్లు ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. దీంతో బస్సులు నడవక ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

రోజువారీగా పనులు చేసుకునేటువంటి ఉద్యోగస్తులు,మహిళలు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాలు ఆటోలు,కార్లతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ సమ్మెకు సిపిఐ, సిఐటియు మద్దతు తెలిపాయి. గుట్ట డిపో ముందు వారికి మద్దతుగా ధర్నా నిర్వహించారు.