28 August, 2026 | 7:34 PM

Breaking News

రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •   మార్కండేయ మందిరంలో ఘనంగా నూలు పున్నమి ఉత్సవాలు   •   ఘనంగా గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన   •   విద్యుత్ అగాధంతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి   •   మైదానంలో గంట.. ఆరోగ్యం మీ వెంట   •   పల్లె దవాఖాన, పీహెచ్సీ సబ్ సెంటర్‌ లను వెంటనే తెరవాలి   •   బాన్సువాడలో నూతన ఎస్ఆర్వో భవన నిర్మాణానికి స్థల పరిశీలన   •   మహేందర్‌ను పరామర్శించిన సునీల్ రావు   •   మందకృష్ణ మాదిగ పోరాటంతోనే వికలాంగులకు హక్కుల సాధన   •  

అల్లు అర్జున్ అభిమానులపై కేసులు

18-12-2024 01:37 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నటుడు అల్లు అర్జున్ అభిమానులపై నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇతరుల ఫిర్యాదుల మేరకు నిందితులపై ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలసులు వెల్లడించారు. 

హైదరాబాద్, జిల్లాల్లోని సైబర్ క్రైమ్ పోలీసుల యూనిట్లు అల్లు అర్జున్ అభిమానుల సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా ట్రాక్ చేస్తున్నాయి. సైబరాబాద్‌ పోలీసుల సోషల్‌ మీడియా మానిటరింగ్‌ టీమ్‌లు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వ్యక్తుల కార్యకలాపాలపై నిఘా పెట్టాలని ప్రభుత్వం ఆదేశించారు. నటుడి అరెస్టును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో అనుచితమైన, రెచ్చగొట్టే కంటెంట్‌ను పోస్ట్ చేయకుండా పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి హానికరమైన కంటెంట్‌ను సర్క్యులేట్ చేసే దుండగులను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. ఇలాంటి ప్రతి సందర్భంలోనూ నిర్దిష్టమైన కేసులు నమోదు చేయాలని, అటువంటి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని సీనియర్‌ అధికారులు, స్టేషన్‌ హౌస్‌ అధికారులందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.