రైతుల కోసం రోడ్ ఎక్కిన రెవిన్యూ, పోలీసు సిబ్బంది
15-05-2026 01:41 AM
చేగుంట మే 14: రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని,రైతు కొనుగోలు కేంద్రల వద్ద లారీల కొరత ఉన్న విషయాన్ని ఆర్డీవో జయ చంద్రా రెడ్డి, తహసీల్దార్ శివ ప్రసాద్ గార్లు గుర్తించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది సంయుక్తంగా రోడ్డెక్కి చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా గురువారం చేగుంట గర్థవర్ లు జయ భరత్ రెడ్డి, సుజాత రెవిన్యూ సిబ్బంది తో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న లారీలను నిలిపివేసి, వాటిని కొనుగోలు కేంద్రాలకు తరలించడం జరిగింది , లారీలను కొనుగోలు కేంద్రాలకు తరలించడం వల్ల మండలంలో ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రవాణా ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ చర్యలతో రైతులకు ఊరట లభించడంతో పాటు కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగాయి,






