calender_icon.png 5 July, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

13-06-2025 12:13:52 AM

  1. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కరించాలి 

భూభారతిలోని అంశాలపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలి 

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్12 (విజయక్రాంతి): ప్రభుత్వం భూ సమస్యల పరి ష్కారం కొరకు చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపా రు. గురువారం  ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు లు సందర్శించి రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ  రెవెన్యూ సదస్సులు వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్‌లో నమోదు చేసి రికార్డులతో సరి చూసి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వివిధ రకాల సమస్యలపై వచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా వేరు చేయాలని, దరఖాస్తుదారుడికి రసీదు అందించాలని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించవలసిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి తమ పరిధిలో లేని దరఖాస్తులనుపై స్థాయికి పంపించాలని తెలిపారు.

రైతులు భూ సమస్యలపై రెవె న్యూ సదస్సులలో దరఖాస్తులు సమర్పించాలని, భూ భారతి చట్టంలోని అంశాలపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ సిడాం పోచ య్య, గిర్ధవార్ సాయి, రెవెన్యూ సిబ్బంది, మాజీ ఎం.పి.పి. పాల్గొన్నారు.

బడిబాట విజయవంతం చేయాలి 

బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం  ఆసిఫాబాద్ మండ లం చిర్రకుంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమానికి హాజరై ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని సం బంధిత అధికారులు సమన్వయంతో కృషిచేసి విజయవంతం చేయాలని తెలిపారు. గురువారం పాఠశాలలు పున: ప్రారంభం అవుతున్న వేళ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాలలో 5 సంవత్సరాల వయసు నిండి న ప్రతి విద్యార్థిని పాఠశాలలలో చేర్పించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థ మయ్యే రీతిలో విద్య బోధన అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, మండల విద్యాశాఖ అధికారి సుభాష్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థు, మాజీ ఎంపిపి అరిగెల మల్లికార్జు న్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.