7 July, 2026 | 3:58 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

లబ్ధిదారులందరికీ సన్న బియ్యం

03-04-2025 04:36 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందించడం జరుగుతుందని సన్నబియ్యం పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మండల తహసిల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ రాజేశ్వర్ లు కోరారు. మండలంలోని చిర్రకుంట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం అందించే లక్ష్యంతో ప్రారంభించిన సన్న బియ్యంను మండలంలోని లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం గండి రామచందర్ మాజీ సర్పంచ్ ఒడ్నాల కొమురయ్య ల ఆద్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్దాల రాజయ్య, దుర్గం సుధాకర్, సంపత్ రావు, అత్తిపోశయ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు.