24 March, 2026 | 7:25 AM

ట్రోఫీ అందేనా?

24-03-2026 01:35 AM

అంచనాలతో ఢిల్లీ క్యాపిటల్స్

కేఎల్ రాహుల్‌పైనే ఆశలు

టీ20 హిటర్స్‌తో బలమైన బ్యాటింగ్

స్టార్క్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు

జట్టులో ప్రతిభావంతులకు కొదవ లేదు. సీజన్లు మారుతున్నా, కెప్టెన్లు మారినా ఆ జట్టు టైటిల్ కల మాత్రం నెరవేరడం లేదు. జట్టు పేరు మార్చుకున్నా కూడా గత నాలుగు సీజన్లుగా లీగ్ స్టేజ్‌కే పరిమితం. ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగా మిగిలిన ఆ జట్టే ఢిల్లీ క్యాపిటల్స్. గత సీజన్‌ను అదిరిపోయేలా ఆరంభించి తర్వాత చతికిలపడింది. ఇప్పటి వరకూ ఒకే ఒక్కసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ ఈ సారైనా టైటిల్ కలను నెరవేర్చుకుంటుందా ?

న్యూఢిల్లీ, మార్చి 23 : ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ టైటిల్ గెలవలే కపోయిన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. ప్రతీ సీజన్ లోనూ మంచి అంచనాలతో, టాలెంటెడ్ ప్లేయర్స్‌తో బరి లోకి దిగినా లీగ్ స్టేజ్‌కే పరిమితమవుతోంది. లీగ్ చరిత్రలో 2020లో రన్నరప్‌గా నిలవడమే ఢిల్లీ క్యాపిటల్స్ అత్యుత్తమ ప్రదర్శన. పలు సీజన్లకు కెప్టెన్లు మార్చినా, కోచ్‌లను, ఆటగాళ్లను మార్చినా ఫలితం మాత్రం మారడం లే దు. నిజానికి 2025 సీజన్ ఆరంభంలో ఢిల్లీ దు మ్మురేపింది.

వరుస విజయాలతో టైటిల్ సాధించేలా కనిపించింది. అనూహ్యంగా గ్రూప్ స్టేజ్ సెకండాఫ్‌లో చేతులెత్తేసింది. ఫస్టాఫ్‌లో జోరును తర్వాత కొనసాగించలేక చతికిలపడింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ నేప థ్యంలో 19వ సీజన్ లోనైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. మినీ వేలానికి ముందు కీలక ఆటగాళ్లను రిలీజ్ చేసిన డీసీ యాజమాన్యం రూ. 21.8 కోట్లతో తమ జట్టును పటి ష్టం చేసుకునే ప్రయ త్నం చేసింది. ఆసీస్ స్పీడ్ స్టార్ మిఛెల్ స్టా ర్క్‌ను దక్కించుకున్న ఢిల్లీ కాశ్మీర్ యువ సంచలనం అకీబ్ దార్ కోసం రూ.8.4 కోట్లు వెచ్చించింది. టీ20 క్రికెట్‌లో ఫినిషర్ గా పేరున్న డేవిడ్ మిల్లర్‌ను అతని కనీస ధరకే దక్కించుకుంది.

అటు బౌలింగ్ విభాగంలో ఎంగిడి, కైల్ జేమిసన్‌లను తీసుకుంది. అయితే మిఛెల్ స్టార్క్ ఫిట్ నెస్ పై సందేహాలున్నాయి. కొన్ని మ్యాచ్ లకు అత ను అందుబాటులో ఉండ డం అనుమానంగానే ఉంది. టీమ్ కాంబినేషన్ విషయానికొ స్తే గత సీజన్‌లో అనవస రంగా ఎక్కువ ప్ర యోగాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా టాపార్డర్‌లో సరైన కూర్పును కొనసాగించలేదు. ఈ సారి మాత్రం అటువంటి తప్పిదాలు చేయకూడదని భావిస్తోం ది. ఓపెనర్‌గా సీనియర్ ప్లే యర్ కేఎల్ రా హు ల్ ఢిల్లీకి కీలకమని చెప్పొ చ్చు. గత సీజన్‌లో రాహుల్ 539 పరుగులతో అదరగొట్టాడు. దీంతో మరోసారి అత నిపైనే ఆశలు పెట్టుకుంది. అలాగే డకెట్ , నిస్సాంక, పృథ్వీ షా, స్టబ్స్ , మిల్లర్, అభిషేక్ పోరల్, నితీష్ రాణా వంటి  ఆటగాళ్ళతో బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోం ది.

కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం బ్యాట్‌తో మెరుపులు మెరిపించగలడు. అ టు బౌలింగ్‌లో స్టార్క్ అందుబాటులో ఉం డడంపైనే సస్పె న్స్ నెలకొంది. స్టార్క్ కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్న నేపథ్యంలో ఎం గిడి, జేమిసన్ లపైనే భారం పడనుంది. దేశీ య బౌల ర్లలో ముఖేశ్ కుమార్, కాశ్మీర్ ఎక్స్ ప్రెస్ అకీబ్ దార్ కీలకం కానున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ తో పాటు కుల్దీప్ యాద వ్ ఢిల్లీకి కీలకం. ఎక్కువ మంది టీ20 స్పెషలిస్టులు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్ లలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందనేది ఆ జట్టు విజయాలను ప్రభావితం చేయనుం ది. గత సీజన్‌లో ఒత్తిడిని తట్టుకోలేక సునాయాసంగా గెలిచే మ్యాచ్‌లను కూడా చేజా ర్చుకుంది. దీంతో టీమ్ కాంబినేషన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకం కానుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్, పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, అజయ్ మండ ల్, కుల్దీప్, స్టార్క్, టి. నటరాజన్, ముఖేష్, చమీరా, ఎ. నిస్సాంక, బెన్ డకెట్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, కైల్ జామీసన్