30 May, 2026 | 2:21 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబు కార్యదీక్షతతో దూసుకుపోతున్న ఐటీ రంగం   •   మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత   •   BRS మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ “అరెస్ట్”   •   దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి   •   భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •  

ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట

13-04-2026 10:38 AM

ఎంపీసీ,బైపిసీ లలో రికార్డు ఫలితాలు వసంతం చేసుకున్న రిషి కళాశాల

ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన రిషి కళాశాల యాజమాన్యం 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తమకు మరెవరు సాటి లేని విదంగా చరిత్ర సృష్టించారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రికార్డు స్థాయి ఫలితాలను రిషి కళాశాల సొంతం చేసుకుంది .

ప్రథమ సంవత్సరం (I Year) ఫలితాలు:

ఎంపీసీ విభాగంలో యు. వినయ్ కుమార్ గౌడ్ 468/470 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. వేణుమాధవ్ రెడ్డి,జి. అంకిత్, జి. మాధురి, ఎ. కార్తీక్ రెడ్డి, సృజన విద్యార్థులు 467 మార్కులతో ప్రతిభ చాటారు.

బైపీసీ విభాగం: కె. అక్షిత, తానియా మహమూద్ 438/440 మార్కులతో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. శ్రావణి, భవిత, సౌమ్య, సురేంద్ర చక్రవర్తి, అక్షిత, ఆయేషా జువా, అఖిల ,అశ్లేష యాదవ్, మౌనిక, రిషిత, నాగ సాయి వైష్ణవి, మైవిన్, కె. మీనాక్షి సహా 14 మంది విద్యార్థులు 437 టాప్ మార్కులు సాధించారు.

ద్వితీయ సంవత్సరం (II Year) ఫలితాలు:

ఎంపీసీ విభాగం:

ఎం. భావన 995/1000 మార్కులతో రికార్డు స్థాయి ఫలితం సాధించారు. మొహమ్మద్ అశ్వాక్ అహ్మద్, సయ్యద్ మిస్బావుద్దిన్, శ్రీవిద్య 992 మార్కులు సాధించగా, కోటేశ్వర్ 990 మార్కులు సాధించారు.

బైపీసీ విభాగంలో అఫ్సా మోయిన్, పి. గాయత్రి , అమూల్య ఈ ముగ్గురు విద్యార్థులు 994/1000 మార్కులతో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. ఫారియా, ఫాతిమా కదీర్ 993 మార్కులు సాధించగా, నందిని రెడ్డి, వైశాలి 992 మార్కులు, శ్రీనిధి 991, సృజన 990, సుమేరా బేగం 990 మార్కులతో ప్రభంజనం సృష్టించారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్‌పర్సన్ శ్రీమతి చంద్రకళ వెంకట్ గారు, డైరెక్టర్ శ్రీ వెంకటయ్య గారు, డీన్ భూపాల్ రెడ్డి గారు, అకాడమిక్ డీన్ కళ్యాణ్ బాబు గారు, ప్రిన్సిపాల్స్ రాఘవేంద్రరావు గారు, వెంకటరత్నం గారు, ప్రసన్నకుమారి గారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్బంగా కళాశాల డైరెక్టర్ వెంకటయ్య  మాట్లాడుతూ, తమ విద్యాసంస్థలో కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించినట్లు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.