30 May, 2026 | 1:45 PM

Breaking News

దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి   •   భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •   డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. గవర్నర్‌తో భేటీ   •   తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఆలస్యంగా విధులకు.. ప్రజల నిరీక్షణ   •   అన్నకు చెల్లెలి నగ్న ఫోటో పంపి డబ్బులు డిమాండ్.. యువకుడు అరెస్ట్   •  

కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

13-04-2026 10:39 AM

సదాశివపేట,కొల్కూర్ గ్రామంలో శనివారం ఆదివారం రెండురోజులు తొలిసారిగా క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ను కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ధనరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం. గ్రామ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు ధనరాజ్ తెలిపారు.

ఈ పోటీలో ఆరు జట్లు పాల్గొని ఉత్సాహంగా పోటీ పడ్డాయి. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆటలను ఆస్వాదించారు. ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ, యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచి క్రీడల వైపు మళ్లించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రామ్ రెడ్డి,తెలంగాణ(TYSS)అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ, మాజీ సొసైటీ చైర్మన్ మాణిక్ రెడ్డి, మాజీ సర్పంచ్ సిల్వరాజ్, మాజీ ఉపసర్పంచ్ సంఘన, వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ పెద్దలు, యువత, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.