5 September, 2026 | 7:13 AM

పెరిగిన ధరలు.. కష్టాలు!

05-09-2026 | 05:30am
  1. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ధరల సూచి పైపైకి..
  2. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలతో నిత్యావసరాలపై ప్రభావం
  3. బెల్లం ,చక్కెర, ఔషధ మందులు, డి ఏ పి, కూరగాయల ధరలతో సామాన్యుల గగ్గోలు.
  4. పెరిగిన ధరలు తగ్గించాలని సామాన్యుల వేడుకోలు

తుంగతుర్తి, సెప్టెంబర్ 4 : కేంద్ర ప్రభుత్వం(central government) తీసుకున్న నిర్ణయాలతో.. సమాజంలో ప్రస్తుతం అధిక ధరల(high prices) ప్రభావంతో, సామాన్య ప్రజలు కష్టాలు చవిచూస్తున్నారు. ప్రపంచ యుద్ధం(world war) కారణంగా, ఒక ప్రక్క డీజిల్, పెట్రోల్ రేట్లు(diesel, petrol rates) పెరగగానే ఒకసారిగా, వ్యాపార రంగములో(business sector) ప్రతి వస్తువుపై, కృత్రిమంగా రేట్లు పెంచడంతో, సామాన్య ప్రజలకు(common people) భారంగా మారాయి.

గడిచిన 10 రోజుల క్రితం కేవలం కేజీ చక్కర 50 రూపాయలు, బెల్లం40 రూపాయలు ఉండగా ఒక్కసారిగా చక్కెర 70 రూపాయలు, బెల్లం 55 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొల్వడంతో కొబ్బరికాయ కూడా గతంలో 25 రూపాయలు ఉంటే, ప్రస్తుతం 35 రూపాయలుగా చలామణిలోకి వచ్చింది. ఔషధ రంగంలో ప్రతి టాబ్లెట్ ధరలు పెరిగాయి.

 వ్యవసాయ రంగం పైనా ప్రభావం 

 వ్యవసాయ రంగానికి వస్తే డి ఏ పి కూడా భారీ స్థాయిలో రేటు పెరిగింది. దీనికి తోడు ఎల్ నివో ప్రభావంతో వాతావరణంలో మార్పులు జరిగి, వర్షాలు పడకపోవడంతో, నేడు రైతుల పరిస్థితి దినస్థితికి చేరుకుంది. పట్టణాల్లో, గ్రామాల్లో నిత్యం తినే కూరగాయల ధరలు కూడా బగ్గుమంటున్నాయి. గత నెలలో ప్రతిదీ కేజీ 30 నుండి 40 రూపాయలకు లభిస్తే, నేడు కేజీ 80 రూపాయల చొప్పున దొరుకుతున్నాయి. ప్రతి వస్తువు ధరలు పెరగడంతో ఏం తినేటట్టు లేదు... ఏం తాగేటట్టు లేదని అంటూ ప్రజలు గుసగుసలాడుతున్నారు.

అంతా కృత్రిమ కొరతే..! : 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచే ధరలు రవ్వంత అయితే.. నేడు వ్యాపారులు, బ్రోక ర్లు , ధరలు డబుల్ పెంచుతూ కృత్తిమ కొరతను సృష్టిస్తున్నారు. గ్రామాల్లో కూడా ప్రతి వస్తువులో కల్తీ కూడా జరిపి ఒకరకంగా భ యంకర వ్యాధులు రావడానికి కారకులవుతున్నారు.ఏది ఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పెంచుతున్న ధరలను తగ్గించి కృత్రి మ కొరతను సృష్టిస్తున్న వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, సామాన్య ప్రజలు కోరుతున్నారు.

 చక్కర, ఔషధాలు రేట్లు బాగా పెరిగాయి 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పెట్రోల్, డీజిల్, ఔషధాలు, చక్కెరల రేట్లు భారీగా పెంచారు. దీనితో ప్రస్తుతం సామాన్యుడు ఏమి కొనేటట్లు లేకుండా పోయింది. గతంలో నెలకు 4000 రూపాయలు పెడితే ఇంట్లో సరుకులకు సరిపోయేవి. ఇప్పుడు అదనంగా 3000, రూపాయలు వెచ్చించవలసి వస్తుంది. పెంచిన ధరలను ప్రభుత్వం తక్షణమే తగ్గించి సామాన్యులపై భారాన్ని తగ్గించాలి.

మట్టిపల్లి వెంకట్, తుంగతుర్తి

మరిన్ని వార్తలు