27 July, 2026 | 6:05 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

రిస్క్ థ్రిల్ పంచుతుంది

31-05-2026 01:37 AM

సంపంగి, 16 వంటి చిత్రాలకు చార్ట్‌బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ స్వీయ సంగీత దర్శక నిర్మాణంలో రూపొందిన కొత్త సినిమా ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ రెండో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సందీప్ మాట్లాడుతూ.. “రిస్క్’ అన్నివర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమా” అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. “మొదట ఈ చిత్రానికి ‘16-2’ అనే టైటిల్ అనుకున్నాం. కానీ ‘రిస్క్’ బాగుంటుందని మా హీరో సూచించారు. మ్యూజికల్‌గానూ సినిమా ప్రేక్షకులకు చేరువ అవుతుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు.