27 July, 2026 | 6:28 PM

Breaking News

పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •   హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: టీయూసీఐ   •  

ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ

27-07-2026 05:54 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య ఆదేశాల మేరకు సోమవారం సేఫ్టీ ఆఫీసర్ కార్యాలయంలో సింగరేణి అధికారుల కోసం ఏఎంబీ, ఏబీ టైపు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఫ్రెష్ అలాట్‌మెంట్‌తో పాటు క్వార్టర్ మార్పు (చేంజ్ ఆఫ్ క్వార్టర్) కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఉద్యోగులకు ఈ కౌన్సిలింగ్ ద్వారా క్వార్టర్లు కేటాయించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్‌వో టు జీఎం, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సి.ఆర్. బానుప్రసాద్ మాట్లాడుతూ... అర్హులైన ఉద్యోగులకు త్వరలో క్వార్టర్ అలాట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. క్వార్టర్ అలాట్‌మెంట్ కమిటీ పూర్తి పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా నిబంధనల ప్రకారమే క్వార్టర్ల కేటాయింపు చేపడుతున్నట్లు వెల్లడించారు.