27 July, 2026 | 6:22 PM

Breaking News

యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •   హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: టీయూసీఐ   •   ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •  

నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష

27-07-2026 05:51 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీలోని వివిధ బూత్ ల బీఎల్ వో లను భాజపా పట్టణ అధ్యక్షులు కొణతం నాగిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కమిటీ కలిసి సర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఓటరు ధ్రువీకరణ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్, కొత్త ఓటర్ల నమోదు,  తొలగింపుల ప్రక్రియపై వివరాలు తెలుసుకోవడంతో పాటు, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, ప్రతి అర్హులైన ఓటరికి అవకాశం కల్పించేలా పారదర్శకంగా విధులు నిర్వహించాలని బిఎల్వోలకు సూచించడం జరిగింది. అలాగే కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు మరియు సౌకర్యాలు సరిగా లేక ఓటర్లకు దూరంగా ఉన్న దగ్గర పోలింగ్ స్టేషన్ల మార్పుల గురించి చర్చించడం జరిగింది.