14-02-2026 12:04:37 AM
జైపూర్, ఫిబ్రవరి 13: ఐపీఎల్-2026 సీజ నుకు ముందు రాజస్థాన్ రాయల్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు నూత న సారథిగా ఆల్రౌండర్ రియాన్ పరాగ్‌ను ఖరారు చేసింది. దీనిపై రాజస్థాన్ రాయల్స్ అధికారిక ప్రకటన చేసింది. గత సీజన్ వరకు కెప్టెన్‌గా పనిచేసిన సంజూ శాంసన్ స్థానాన్ని పరాగ్ భర్తీచేయనున్నాడు. తొలుత పరాగ్‌తోపాటు రవీంద్రజడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు రాజస్థాన్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ రాజస్థాన్ మేనెజ్మెంట్ మాత్రం పరాగ్ వైపే మొగ్గు చూపింది. వేలానికి ముందు ట్రేడింగ్ విండో ద్వారా సంజూ శాంసన్‌ను వదిలేసి జడేజా, సామ్‌కరన్‌లను తీసుకుంది. సీనియర్ ప్లేయర్‌గా, మ్యాచ్ విన్నర్ గా పేరున్న జడేజాకే పగ్గాలు అప్పగిస్తారని భావించారు. అటు జైస్వాల్, ధృవ్ జురెల్ కూడా పరాగ్ కంటే రేసులో ముందున్నట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కానీ రాయల్స్ యాజమాన్యం మాత్రం పరాగ్ పైనే నమ్మకముంచింది.
రియా న్ పరాగ్ 2019 నుంచి రాజస్థాన్ జట్టుతో కొనసాగుతున్నాడు. అ స్సాం జట్టుతోపాటు రాజస్థాన్ కెప్టెన్‌గా కూడా పరాగ్‌కు పనిచేసిన అనుభవం ఉంది. ఐపీఎల్-2025 సీజన్‌లో గాయాలైన సంజూ స్థానంలో 8 మ్యాచ్లకు పరాగ్ నాయకత్వం వహించాడు. పరాగ్ కెప్టెన్సీలో రాయల్స్ కేవలం రెండే మ్యాచ్‌లే గెలిచింది. హెడ్‌కోచ్ కుమార్ సంగక్కర సూచనతో పరాగ్‌కు జట్టు పగ్గాలను రాజస్థాన్ అప్పగించినట్లు సమాచారం.
రియాన్‌పరాగ్ 2019 లో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరుఫున అరం గ్రేటం చేశాడు. ఇప్పటివరకు అతడు 84 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 26.1 సగటుతో 1,566 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది సీజన్ కుముందు రాజస్థాన్‌జట్టులో కీలక మార్పు లు చోటుచేసుకున్నాయి. సంజూ శాంసన్ చెన్నైకి వెళ్లిపోగా.. రాహుల్‌ద్రవిడ్ హెడ్ కోచ్‌గా తప్పుకోవడంతో కుమార్ సంగక్కర ఆధ్వర్యంలో రాజస్థాన్ బరిలోకి దిగనుంది.