9 April, 2026 | 5:03 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

భారత్ శుభారంభం

14-02-2026 12:03 AM

ఇంటర్నేషనల్ అరెనా పోలో చాంపియన్‌షిప్

హైదరాబాద్, ఫిబ్రవరి 13: హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ అరెనా పోలో చాంపియన్ షిప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో 15-5 గోల్స్ తేడాతో లక్సంబర్గ్‌పై ఘనవిజయం సాధించింది. తొలి చక్కర్ నుంచే భారత ఆటగాళ్లు అదరగొట్టా రు. దూకుడుగా ఆడుతూ వరుస గోల్ న మోదు చేశారు. భారత జట్టు కెప్టెన్ యూస ఫ్ అజ్మి ఈ మ్యాచ్‌లో అత్యధికంగా ఆరు గోల్స్ కొట్టాడు.

అలాగే భారత్ తరపున చైతన్య కుమార్ 4 , కుమార్ విశాల్ సింగ్ 3, మహమ్మద్ నయీముద్దీన్ 1 గోల్ సాధించారు. వారం రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో తొలిరోజు చిన్నారి రైడర్లకు షో జం పింగ్ ఈవెంట్ నిర్వహించారు. అలాగే హైదరాబాద్‌లో తొలిసారి ఈ పోటీలు నిర్వహిస్తు న్న నేపథ్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శనివారం ట్రాక్టర్ స్టంట్స్, లేజర్ షోతో పాటు మహిళా పోలో ప్లేయర్స్ తో ప్రత్యేక ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. కాగా అంతర్జాతీయ అత్యుత్తమ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న హెచ్ పీఆర్ సీపై విదేశీ ప్లేయర్స్ ప్రశంసలు కురిపించారు.