రోడ్డుకు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలి
గడ్డపోతారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్
జిన్నారం, ఆగస్టు 21: ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా మాదారంలో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్ రోడ్లు ఆర్ అండ్ బి అధికారులను కోరారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. గుంతలు పడిన రహదారుల తో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అసంపూర్తిగా ఉన్న మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని కోరారు. వర్షాకాలం, రద్దీ సమయంలో ప్రమాదాలు జరగకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లేష్ ముదిరాజ్, స్వాతి గణేష్, నవీన్, ఆర్ అండ్ బి అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.






