శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాబర్ట్ వాద్రా
30-08-2024 04:37 PM
హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రార్థనా స్థలాలకు వెళ్లి వికలాంగ పిల్లలతో సహా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటారు. తాను రెండు రోజుల పర్యటనలో ఉన్నానని వాద్రా తెలిపారు. ఇక్కడి ఆర్‌జీఐ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నాను.. దేశవ్యాప్తంగా వెళ్లినట్లే హైదరాబాద్‌లో ఉన్నా.. తెలంగాణలో కొన్ని సంస్థలకు వెళ్తానన్నారు. అంధులు, వికలాంగ పిల్లలను కూడా కలుస్తాను. నేను మసీదులతోపాటు దేవాలయాలకు కూడా వెళ్తానని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు.






