9 May, 2026 | 5:58 AM

హైదరాబాద్ లో తగ్గిన బంగారం ధరలు

30-08-2024 04:49 PM

హైదరాబాద్: బంగారం ధరలు నేడు హైదరాబాద్ లో స్వల్పంగా తగ్గాయి. 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 100 తగ్గి రూ. 67,050గా నమోదు కాగా, 24 కేరట్ల బంగారం 10 గ్రముల ధర రూ. 10 తగ్గి 73,150గా ఉంది. వెండి కేజీ ధర రూ. 93 వేల వద్ద స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా గత కొన్ని వారాలుగా బంగారం ధరలు తగ్గు ముఖం  పడుతున్నాయి. ఫలితంగా 24కేరెట్ల బంగారం ధర రూ. 70 వేలు, 22 కేరట్ల పుత్తడి ధర రూ. 66వేలకు అటూఇటూగా కదలాడుతోంది. ఇక్కడ పేర్కొన్న ధరలు నిన్నటి మార్కెట్ క్లోజింగ్ ధరలు మాత్రమే. బంగారం కొనుగోలు సమయంలో వీటిలో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.