హిందూ ధర్మం మతం కాదు... జీవన విధానం
మానకొండూరు, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): హిందూ ధర్మం అంటే మతం కాదని జీవన విధానమని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సహ సంఘచాలక్ ఎలగందల సత్యనారాయణ చెప్పారు. భారత దేశం ప్రపంచానికి ఆదర్శమని,ప్రతిఒక్కరు హిందూసంస్కృతి,సంప్రదాయాలు కాపాడుకోవాలని కోరారు.
మండల కేంద్రమైన మానకొండూరులో శనివారం శ్రీరామహిందూ సమ్మేళన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యనారాయణ హాజరై మాట్లాడారు.దేశ ప్రగతికి సత్యం, ధర్మంవంటి విలువలను ఆచరించడం అవసరమని, పంచ పరివర్తనల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని వక్తలు పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, ఐక్యత అవసరాన్ని వారు ప్రస్తావించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.దేశంలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం అవసరమని పేర్కొన్నారు.
సమ్మేళనం సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. శ్రీరామ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో పాల్గొన్న వారందరికీ అల్పాహారం, మజ్జిగ, పంపిణీ చేశారు. వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ హిందూ సమ్మేళన సమితి , అధ్యక్షులుసరఫ్ రామకృష్ణ, గర్రెపల్లిమహేశ్వర శర్మ, మహిళా వక్త అనుపమ హాజరయ్యారు. సదాశివ పల్లి, మానకొండూర్ , ముంజంపల్లి, శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, ఈదులగట్టెపెల్లి,గ్రామాల హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో శ్రీరామ హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు.






