14 August, 2026 | 5:12 PM

కన్నెపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసు ఏర్పాటు కోసం ధర్నా

14-08-2026 04:02 PM

కన్నెపల్లి,(విజయ క్రాంతి): తహసీల్దార్ కార్యాలయాన్ని కన్నేపల్లి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కన్నేపల్లి గ్రామస్తులు శుక్రవారం బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కార్యాలయాన్ని కన్నేపల్లి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండేలా మండల కేంద్రంలోనే కొనసాగించాలని ఆందోళనకారులు కోరారు. బంద్‌కు గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు, యువత, ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు. గ్రామస్తులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.