ఆర్టీసీ బస్సు బీభత్సం

11-09-2026 | 05:25am
  1. పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లి పలు వాహనాలకు ఢీ
  2. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే కారణం!
  3. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో ఘటన

అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 10: రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) బాటసింగారంలో గురువారం ఆర్టీసీ బస్సు బీభత్సం(RTC bus rampage) సృష్టించింది. దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురు వారం ఉదయం 9 గంటలకు దిల్‌సుఖ్‌నగర్(Dilsukhnagar) నుంచి చౌటుప్పల్(Choutuppal) బయలుదేరింది. మార్గ మధ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం(Abdullapurmet Mandal) బాటసింగారం పరిధి విజయవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్‌(Vijayawada National Highway service road)లో ఉన్న భారత్ పెట్రోల్ బంకు(Bharat Petrol Pump)లోకి దూసుకెళ్లింది.

బంకులో ఆయిల్ నింపుకుంటున్న కారును, మినీ వ్యాన్‌ను ఢీ కొట్టింది. పెట్రోల్ పంప్‌ను కూడా ఢీకొట్టడంతో ఆయిల్ డిస్ ప్లే, పెట్రోల్ గన్, పిల్లర్, విద్యుత్ తీగలు దె బ్బతిన్నాయి. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగంతో నే  ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసిం ది. పెట్రోల్ బంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అ బ్దుల్లాపూర్‌మెట్ సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు