17 June, 2026 | 1:41 AM

రగ్బీ ప్రీమియర్ లీగ్ షురూ

17-06-2026 12:22 AM

హైదరాబాద్, జూన్ 16 : రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఉత్సాహంగా మొదలైంది. తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రగ్బీ ఇండియా రాహుల్ బోస్ పోటీలను ప్రారంభించారు. తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహిళల ట్రోఫీని కూడా ఆవిష్కరించారు.

హైదరాబాద్‌లో రగ్బీ లీగ్ నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వానికి గర్వకారణమని మంత్రి శ్రీహరి వ్యాఖ్యానించారు. క్రీడా ప్రతిభను ప్రోత్సహించి యువతకు అవకాశాలు కల్పించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. కాగా ఆరంభ వేడుక ల్లో హీరోయిన్ శృతిహాసన్ సందడి చేసింది.