29 May, 2026 | 2:53 AM

విద్యార్థులతో పాలకుల ఆటలు!

29-05-2026 12:00 AM

ఎన్టీయేకు రాజ్యాంగబద్ధమైన లేదా పార్లమెంటరీ చట్టబద్ధత లేదు. ఇది ‘సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్’ కింద నమోదైన సాధారణ సంస్థ మాత్రమే. ప్రభుత్వం తలచుకుంటే నిబంధనలు మార్చగలగడం వల్ల రాజకీయ జోక్యాలకు అవకాశాలు పెరిగాయి. శాశ్వత నిపుణుల బృందం లేకపోవడం, కీలక బాధ్యతలను ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడం వల్ల అవినీతి, లీకేజీలు, దందాలకు మార్గం సుగమమైంది. 

దేశంలో ఉన్నత విద్యలో ఉన్నతస్థాయి ప్రమాణాలు, పారదర్శకత, సమాన అవకాశాలు, కచ్చితత్వం, విశ్వసనీయత లాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతూ 2018లో ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నేడు లక్షలాది మంది విద్యార్థుల కలలను ఛిద్రం చేసే విఫల వ్యవస్థగా మారిపోయింది. నీట్, జేఈఈ, నెట్ వంటి కీలక పరీక్షల్లో వరుసగా బయటపడుతున్న పేపర్ లీకేజీలు, అవకతవకలు, నిర్వహణ వైఫల్యాలు చూస్తుంటే ఇది విద్యావ్యవస్థలా కాకుండా యువత భవిష్యత్తుతో ఆడుకునే ఒక మోసకారి వ్యవస్థలా కనిపిస్తోంది.

విద్యావ్యవస్థలో నెలకొన్న ఈ సంక్షోభం యాదృచ్ఛికం కాదు. విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ఔట్‌సోర్సింగ్ వైపు నెట్టిన పాలక విధానాల ఫలితమే ఇది. పేపర్ లీకేజీలు కేవలం పరీక్షల వైఫల్యాలు కావు; చదువే ఆస్తి గా బతుకుతున్న పేద, బహుజన, మధ్యతరగతి యువతపై జరుగుతున్న సామాజిక అన్యాయం. ముఖ్యం గా గ్రామీణ కుటుంబాల విద్యార్థులకు ఈ పరీక్షలు ఉద్యోగ అవకాశాల కంటే ఎక్కువనే చెప్పాలి. కుటుంబ ఆశలు, సామాజిక గౌరవం, అమ్మాయిలకు స్వతంత్ర జీవితానికి మార్గాలు ఇవి. ఒక పేపర్ లీక్ వల్ల కోల్పోయేది కేవలం విద్యా సంవత్సరం కాదు; వేల కుటుంబాల ఆశలు, మానసిక స్థిరత్వం కూడా.

ఎన్టీయే వెనుక అసలు సంక్షోభం

ఎన్టీయేకు రాజ్యాంగబద్ధమైన లేదా పార్లమెంటరీ చట్టబద్ధత లేదు. ఇది ‘సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్’ కింద నమోదైన సాధారణ సంస్థ మాత్రమే. ప్రభుత్వం తలచుకుంటే నిబంధనలు మార్చగలగడం వల్ల రాజకీయ జోక్యాలకు అవకాశాలు పెరిగాయి. శాశ్వత నిపుణుల బృందం లేకపోవడం, కీలక బాధ్యతలను ప్రైవేట్ కాం ట్రాక్టు సంస్థలకు అప్పగించడం వల్ల అవినీతి, లీకేజీలు, దందాలకు మార్గం సుగ మమైంది. విద్యార్థుల ప్రతిభను శాస్త్రీయం గా అంచనా వేసే పరిశోధనా వ్యవస్థ కూడా లేకపోవడం మరో పెద్ద లోపం.

అసమానతలను బలపరచడమే

మెరిట్ పేరుతో అమలవుతున్న కేంద్రీకృత పరీక్షా విధానం వాస్తవానికి సామాజి క అసమానతలను మరింత పెంచుతోంది. ఖరీదైన కోచింగ్ వ్యవస్థలకు చేరుకోలేని విద్యార్థులు అవకాశాల లోపంతో ఒకసా రి, అవకతవకలతో మరోసారి తీవ్రంగా నష్టపోతున్నారు. సమాన అవకాశాల సాధనంగా ఉండాల్సిన విద్యావ్యవస్థ, ఇప్పుడు అసమానతలను బలపరిచే యంత్రంగా మారుతోంది.

సీబీఎస్‌ఈలోనూ అదే నగ్నసత్యం

పరీక్షల నిర్వహణలో వైఫల్యం కేవలం ఎన్టీయేకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తం గా విశ్వసనీయ సంస్థగా చెప్పుకొనే సీబీఎస్‌ఈలో కూడా గతంలోనూ, ఇప్పుడూ పేపర్ లీకేజీలు, అవకతవకలు వెలుగులోకి రావడం శోచనీయం. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఈ రెండు ప్రధాన సంస్థలు వరుసగా వైఫల్యం చెందడం చూస్తుంటే, ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం కాదు; విద్యావ్యవస్థలో పెరుగుతున్న నిర్మాణాత్మక సంక్షోభానికి సంకేతం. ప్రతిఘటన తర్వాత కమిటీలు, విచారణలు, సమీక్షలు పేరుతో కాలయాపన తప్ప అసలు బాధ్యులపై కఠిన చర్య లు కనిపించడం లేదు. నైతిక బాధ్యత వహి స్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయలేదు. ఇదే విద్యార్థుల్లో అనిశ్చితి, ఆవేదనను మరింత పెంచుతోంది.

ఏబీవీపీ రాజకీయ నాటకం..

ఈ సంక్షోభంలో అత్యంత కపటమైన అంశం అధికార రాజకీయాల ద్వంద్వ వైఖరిలో కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే వ్యవస్థలోనే ఎన్టీయే అక్రమాలు బయటపడినా, అదే రాజకీయ శక్తుల అనుబంధ విద్యార్థి సం ఘమైన ఏబీవీపీ పశ్చిమ బంగాల్ రాష్ట్రం లో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడం రాజకీయ నాటకంగా మారింది. ప్రజల భాషలో చెప్పాలంటే ‘దొంగే దొంగా’ అని అరిచినట్లు పరిస్థితి ఉంది. ఈ నిరసనల వెనుక అసలు ఉద్దేశం విద్యార్థుల పక్షాన పోరాటం కంటే, కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజాగ్రహాన్ని దారిమళ్లించడమే అన్న అనుమానం బలపడుతోంది.

బాధ్యతల నుంచి తప్పించుకోవడమే

ప్రత్యేకించి విపక్ష పాలిత రాష్ట్రాల్లో ఈ సమస్యను రాజకీయ లాభాలకు వాడుకోవడం, స్థానిక ఉద్యమాలపై నిందలు మోపడం కూడా ఈ వ్యూహంలో భాగం గా కనిపిస్తోంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కనిపించిన ఆలస్యం మద్దతు ద్వంద్వ రాజకీయాల మాదిరిగానే, ఎన్టీయే అంశంలో ఏబీవీపీ నిరసనలు కూడా బాధ్యత నుంచి తప్పించుకునే రాజకీయాలనే గుర్తుచేస్తున్నాయి. నేడు విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, ఉద్యమకారులు ప్రశ్నిస్తే సమాధానాల కంటే ప్రచారమే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం బలహీనపడితే ఇలాం టి సంక్షోభాలు మరింత ప్రమాదకరంగా మారతాయి.

వ్యవస్థాగత ప్రక్షాళన జరగాలి

ఇప్పటికే పరిస్థితి సాధారణ పరిపాల నా లోపాల దశ దాటిపోయింది. విద్యా వ్యవస్థలో మూలపూర్వక మార్పులు అవసరం. ఎన్టీయేను పార్లమెంటు చట్టం ద్వారా పూర్తి స్వతంత్ర సంస్థగా మార్చాలి. యూపీఎస్సీ తరహాలో రాజకీయ జోక్యాలకు అతీతంగా పనిచేసే వ్యవస్థ అవసరం. పరీక్షల నిర్వహణలో ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, దేశంలోని విశ్వవిద్యాల యాల ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, స్వతంత్ర నిపుణులతో శాశ్వత అంతర్గత బృందాలను ఏర్పాటు చేయాలి (వీరిని కూడా అధికార పార్టీ సిద్ధాంతకర్తలను నియమించుకుండా సర్వ స్వతంత్రులను నియ మించాలి). పేపర్ లీకేజీలు, అవకతవకల కు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే పరీక్షా కేంద్రాలుగా ప్రైవేట్ కాలేజీల కంటే ప్రభుత్వ విద్యాసంస్థలకే ప్రాధాన్యత ఇవ్వాలి.

విశ్వాసాన్ని పునర్నిర్మించాలి

విద్య అనేది వ్యాపార సరుకు కాదు; అది ఒక తరం భవిష్యత్తు. కానీ, నేడు రాజకీయ నిర్లక్ష్యం కారణంగా విద్యా ర్థుల శ్రమ బుగ్గిపాలవుతోంది. రీ-ఎగ్జామ్‌లతో సమస్య పరిష్కారం కాదు. పరీక్షల నిర్వహణ వ్యవస్థ మొత్తాన్ని పారదర్శకంగా, జవాబుదారీతనంతో పునర్ని ర్మించాల్సిన అవస రం ఉంది. ఒక పరీక్షను మళ్లీ నిర్వహించవచ్చు. కానీ, కోల్పోయిన యువత నమ్మ కాన్ని తిరిగి తీసుకురావడం అంత సుల భం కాదు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం అంటే దేశ భవిష్యత్తును కాపాడట మే. అందుకే ఈ పోరాటం కేవలం పరీక్షల కోసం కాదు; సమానత్వం, న్యాయం, ప్ర జాస్వామ్య బాధ్యత కోసం కూడా.

వ్యాసకర్త: గెస్ట్ ఫ్యాకల్టీ, 9000180941

పీ రేణుక భూంపల్లి