17 June, 2026 | 8:43 PM

Breaking News

ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •  

ఐక్యతకు ప్రతీక రన్ ఫర్ జీసస్

05-04-2026 12:03 AM

సికింద్రాబాద్ నుంచి అబిడ్స్ వరకు ర్యాలీ

సికింద్రాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): : క్రైస్తవుల ఐక్యతకు ప్రతీకగా నిలిచే రన్ ఫర్ జీసస్ ర్యాలీ శనివారం సికింద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగే ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఆరాధన టీవీ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో కాథలిక్, ప్రొటెస్టంట్ విభాగాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ లోని బసలికా సెయిం ట్ మేరీస్ చర్చి వద్ద ప్రారం భమైన ర్యాలీ బైబిల్ హౌజ్, ట్యాంక్బండ్, లిబర్టీ,అబిడ్స్ సెయింట్ జార్జ్ స్కూల్ వరకు కొనసాగింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 800 కు పైగా కేంద్రాల్లో ఉదయం 6 గంటలకే ఈ ర్యాలీ ప్రారంభమైందని నిర్వాహ కులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యా ప్తంగా 40 ప్రాంతాల్లో సుమారు 200 కిలోమీటర్ల మేర సాగిన ఈ కార్యక్రమంలో కార్డినల్ పూల ఆంటోనీ, బిషప్ కె. రూబెన్ మార్క్, బిషప్ ఎ.సిమియోన్, సినీ నటి జయసుధ, సీనియర్ ప్రతి నిధులు జెరుసాలెం మత్త య్య, జాన్సన్‌తో పాటు పలువు రు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

క్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటుతూ సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది విశ్వాసులు జెండాలు చేతబూని, జీసస్ ప్రార్థనలు చదువుతూ, మరో వైపు క్రైస్తవుల ఐక్యత వర్థిల్లాలి అంటూ నినదిస్తూ ఉత్సాహంగా పరుగెత్తారు.