కీవ్‌పై రష్యా క్షిపణి దాడులు
ఇద్దరు మృతి, 83 మందికి గాయాలు
మూడోసారి ఒరేష్నిక్ క్షిపణితో దాడులు
కీవ్, మే 24: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా డ్రోన్లు, ఒరేష్నిక్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. బిలా సెర్కా నగరంలో ఆదివారం ఉదయం భారీ దాడులకు పూనుకుంది. ఈ దాడుల్లో నివాస భవనాలు, పాఠశాలలు, మార్కెట్ ప్రాంతం, పలు ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నాయి. ఇద్దరు పౌరులు మృతి చెందగా, 83 మందికి గాయాలైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దాడుల కారణంగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
గడిచిన నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఈ ఆయుధాన్ని ఉపయోగించడం ఇది మూడోసారి మాత్రమే కావడం గమనార్హం. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్సీ తీవ్రంగా మండిపడ్డారు. సాధారణ పౌరులే లక్ష్యంగా రష్య దాడులకు తెగబడడం శోచనీయమన్నారు. హైపర్ సోనిక్ మిస్సైల్స్‌ను ప్రయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ఇప్పటి వరకు రష్యా స్పందించలేదు. ఒరెష్నిక్ మిస్సైల్ బాలిస్టిక్ క్షిపణి రష్యా వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణుల్లో ఇది ఒకటి. గంటకు 13వేల కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. యూరప్‌లోని అన్ని దేశాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. కాగా రష్యాపై ఇటీవల ఉక్రెయిన్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడులు జరిపినట్లు మాస్కో ప్రకటించింది.






