25 May, 2026 | 1:04 AM

నీట మునిగి ఎనిమిది మంది మృతి

25-05-2026 12:02 AM

అల్చిప్పల కోసం వాగులోకి ౧౧ మంది

వాగు ఉధృతికి గల్లంతు ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు

కర్ణాటకలోని శిరాలీలో విషాదం

బెంగళూరు, మే ౨౪: అల్చిప్పల (షెల్ స్టోన్స్) కోసం వాగులోకి దిగి ఎనిమిది మం ది మృతిచెందిన ఘటన కర్ణాటకలోని భత్కల్ తాలూకా శిరాలీలో చోటుచేసుకుంది. శిరాలీ గ్రామానికి చెందిన లక్ష్మీమహాదేవ్‌నాయక్ (42), ఉమేష్‌నాయక్(30), లక్ష్మీనాయక్ (30), లక్ష్మీ అన్నప్ప నాయక్ (60), లక్ష్మీ శివరామ్ నాయక్ (49), జ్యోతినాగప్ప నాయక్ (34), మాలతి నాయక్ (38), మస్తమ్మనాయక్, నాగరత్న, మహాదేవి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.

వీరంతా రోజూలాగే ఆల్చిప్పల కోసం ఆదివారం తట్టిహక్కల్ కాలినాటి హోలె వాగులోకి దిగారు. నిన్నమొన్న కురిసిన వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా వారంతా గల్లంతయ్యారు. వారిలో నాగరత్న, మహాదేవి అతి కష్టంమీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీస్, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి వచ్చాయి. ఈ బృందాలు శ్రమించి ౮ మంది మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలంలో బాధితుల కుటుంబ సభ్యు ల రోదనలు మిన్నంటాయి. శిరాలీ గ్రామం లో తీవ్ర విషాదం నెలకొంది.