17 April, 2026 | 10:52 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలి

20-02-2026 03:45 PM

మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి

రైతులకు యూరియాను అందించి ప్రభుత్వం అండగా ఉండాలి

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర మాజి జడ్పిటిసిల పోరం ప్రధాన కార్యదర్శి మండల మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలతో పాటు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ అమలులో పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు.

రైతు రుణమాఫీ చేయడంలో విఫలం కావడంతో,కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరిట రైతులకు లేని ఆంక్షలు కొర్రీలు పెట్టి కేవలం 40 నుంచి 60 శాతం మందికి మాత్రమే రుణమాఫీని వర్తింప చేశారని, మందలంలో సుమారు 2500 మంది రైతులకు ఋణ మాఫీ కలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి బూటకపు హామీలు ఇచ్చారని, రైతులకు రైతుబంధు కింద 15,000 ఇస్తామన్న పథకం పత్తా లేకుండా పోయిందని, కౌలు రైతులకు 12 వేలు, ఊసే లేదని, కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ కూడా తుంగల తొక్కారని, మహిళలకు 2,500 పెన్షన్ ఇప్పటివరకు ఇవ్వలేదని, ఆవేదన వ్యక్తం చేశారు.

యువతకు ఉద్యోగాల కల్పన లేదని 6 గ్యారంటీలకే దిక్కు మొక్కులేదని,కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు,ఏకకాలంలో  రుణం పొందిన రైతులకు రుణమాఫీ చేయాలని కోరారు.రుణ విముక్తులను చేయాలని,రైతు బంధు వెంటనే విడుదల వేయాలని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాజీ జెడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి కోరారు.అలాగే రైతులకు యూరియా సరిపడే అందించి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.

రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు ఆన్లైన్ బుకింగ్ విధానం రద్దుచేసి పాస్బుక్కుల ద్వారా సరపరా  చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులు యూరియా లభించక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు.రైతులు చెప్పినట్లయితే, యూరియా కోసం ఏర్పాటుచేసిన ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ వాస్తవ రైతులకు సరఫరా రాకుండా ఉందన్నారు.ఇది పంట సాగింపులో అడ్డంకి కలుగ చేస్తుందని రైతులు ఆందోళనను కలుగజేస్తుందని మాజీ జెడ్పిటిసి ఉమన్న గారి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని రద్దు చేసి రైతు వ్యవసాయ పాస్ బుక్కు ఆధారంగా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.రైతుల ప్రక్కన ప్రభుత్వం నిలబడాలని పంటల సాగింపులో తగిన సమయానికి ఎరువులు అందించడం ద్వారా రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అన్నారు. కామారెడ్డి జిల్లా రైతులు పంటలు పండించి కష్టపడి వ్యవసాయం చేస్తుందని ప్రభుత్వం చర్యలు రైతుల ఆశల కోసం సరైనవిగా ఉండాలని అభ్యర్థించారు.