15 June, 2026 | 3:01 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

సాగర్ ఫ్లుఓవర్‌కు ఫూలే పేరు పెట్టాలి

18-02-2026 01:39 AM

టీఆర్పీ నాయకుల డిమాండ్

ఎల్బీనగర్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు ఫ్లుఓవర్‌కు మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరు పెట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ ఎల్‌బి నగర్ జోనల్ కమిషనర్‌కు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

మహాత్మా జ్యోతిరావు ఫూలే సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా విస్తరణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష సేవలు చేసిన మహనీయుడని తెలిపారు. ఎల్బీనగర్ ప్రాంత ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ సాగర్ రింగ్ రోడ్ ఫ్లుఓవర్‌కు మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరు అధికారికంగా నామకరణం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అంజన్ కుమార్ యాదవ్, ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షులు సంపత్ పాల్గొన్నారు.