calender_icon.png 18 February, 2026 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘జేఈఈ’ ఫలితాల్లో రెసోనెన్స్ ప్రభంజనం

18-02-2026 01:40:25 AM

63 మంది విద్యార్థులకు 99పైగా పర్సంటైల్

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ 2026 (సెషన్-1) ఫలితాల్లో నగరంలోని ‘రెసోనెన్స్’ ప్రభంజనం సృష్టించింది. ఈ ఫలితాలలో 63 మంది విద్యార్థులు 99 పైగా పర్సంటైల్ సాధించారు. మరో 505 మందికి పైగా విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో 99 పర్సంటైల్ మార్కులతో సత్తా చాటారు. మాదాపూర్‌లోని ఆశ్రయ్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విజేతలను, తల్లిదండ్రులను, అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.

రెసోనెన్స్ టాప్ ఐదు విద్యార్థులు సమృద్ధి భట్టాచార్య 99.988, రేవంత్ వంగల 99.982, సాకేత్ రెడ్డి బొమ్మడి 99.932, బూనేటి ఆదిత్యారెడ్డి 99.918, శెట్టిపల్లి అన్వితరెడ్డి 99.915. అభినందన కార్యక్రమంలో రెసోనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు, రెసోనెన్స్ హైదరాబాద్ కేంద్రాల సీఓఓ మార్కండేయ, హైదరాబాద్ కేంద్రాల సెంట్రల్ అకడమిక్ డీన్ డీకే ఝా పాల్గొన్నారు.

రెజోనెన్స్ వరంగల్ విద్యాసంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి మాట్లాడుతూ.. బి. సాకేత్ రెడ్డి 99.93, ఎన్. నాగ చైతన్య 99.78, పి. కార్తికేయ 99.76, ఎ. రితిక 99.73, యం. సాయి కౌషిక్ 99.70, జె. హర్షిత్ 99.68, వై. సాత్విక 99.65, యం.డి అషార్ ఇక్బాల్ 99.36, ఆర్. జయంత్ 99.34, సి. హెచ్. సాయి వర్షిత్ 99.21, జి. వర్థిని 99.18, ఎస్. ఆకర్ష్ 99.15, యం. సాత్విక్ రెడ్డి 99.02 పర్సంటైల్ సాధించారని చెప్పారు.

ఈ సందర్భంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్స్ లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, సి.ఎ.ఒ. లెక్కల రమ్యరాజి రెడ్డి, అకడమిక్ డీన్ బి.యస్. గోపాలరావు పాల్గొన్నారు.