18-02-2026 01:38:01 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాం తి): చేగుంట మండల టీఆర్పీ అధ్యక్షుడు కంచ ర్ల సిద్ధగౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. రాష్ట్ర నాయకులు బసాపురం నాగేష్ ముదిరాజ్, మెదక్ జిల్లా అధ్యక్షులు ఈమాపురం యాదగిరి గౌడ్ పార్టీ కండువా కప్పి నాయకులను ఘనంగా స్వాగతించారు. చేగుంట మండలంలోని బోనాల గ్రామానికి చెందిన వివిధ పార్టీ ల నాయకులు టిఆర్పిలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు స్వామి ఠాగూర్ ముదిరాజ్, బీజేపీ గ్రామ అధ్యక్షుడు పోచ య్య, రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు చేరికయ్యారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు కమలయ్య గారి సురేష్ ముదిరాజ్, జిల్లా నాయకురాలు సమీరా బేగం, జిల్లా యూత్ అధ్యక్షుడు పోతుల రవీందర్, మంకిడి రాములు ముదిరాజ్, శేఖర్ నేత, అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, చేగుంట మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, అన్నసారం రాజు పాల్గొన్నారు.