31 August, 2026 | 9:59 AM

సాంబ శర్వాణి రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

31-08-2026 09:09 AM

మల్కాజిగిరి, ఆగస్టు 30,(విజయక్రాంతి): మల్కాజ్‌గిరి నియోజక వర్గంలోని కళ్యాణ్ నగర్ రోడ్ నంబర్–2లో సాంబా శర్వాణి ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ నూతన కార్యాల యాన్ని ఆదివారం   మల్కా జ్గిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై  ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన, కార్యాలయ నిర్వాహకులు వైశాలి, మల్లేష్ యాదవ్, శ్రీనులకు శుభాభినందన లు తెలియజేశారు. నూతనంగా ప్రారంభించిన మీ సంస్థ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు శిఖ ప్రభాకర్ గౌడ్, మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, బాబురావు, వెంకటేష్, జంగరాజు, శ్రీధర్, మురళి నాయుడు, సోనూతో పాటు  కాలనీ వాసులు  పాల్గొన్నారు.