31 August, 2026 | 10:33 AM

Breaking News

40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   హరీష్ నాయక్ కుటుంబానికి ఎంపీ ‘వేం’ పరామర్శ   •   రాష్ట్ర మహా సభల గోడ పత్రికల ఆవిష్కరణ   •   పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •  

వెంకటాపురం మండలంలో ప్రత్యేక ఓటర్ సవరణ

31-08-2026 09:49 AM

రెండు పోలింగ్ కేంద్రాల్లో 204 మందికి నోటీసులు

వెంకటాపురం (నూగూరు) ఆగస్టు 30 (విజయ క్రాంతి): భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా వెంకటాపురం మండలంలో అధికారులు వేగం పెంచారు. ఓటరు జాబితాలో డూప్లికేషన్, చిరునామా మార్పు, తప్పుడు నమోదు వంటి అనుమానిత కేసులను బూత్ లెవెల్ ఆఫీసర్ల (బిఎల్ఓ) ద్వారా గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా పీఎస్ 30 ఒంటిమామిడి పరిధిలో 130 మంది ఓటర్లకు ఫారం-7 కింద నోటీసులు జారీ కాగా వీరికి వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్, ఈఆర్వో ఆధ్వర్యంలో పరిశీలన నిర్వహించనున్నారు.

అదేవిధంగా పీఎస్ 48 రాచపల్లి పరిధిలో మరో 74 మంది ఓటర్లకు నోటీసులు జారీ కాగా వీరికి మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హియరింగ్ కు వచ్చే ఓటర్లు ఓటరు గుర్తింపు కార్డు,ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా చిరునామా నిరూపణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని,నిర్ణీత తేదీలో హాజరు కాకపోతే ఓటు తొలగించబడే అవకాశం ఉందని, ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు హక్కును కాపాడుకోవాలని వెంకటాపురం తహసీల్దార్ ఎం. వేణుగోపాల్ తెలిపారు.