31 August, 2026 | 10:32 AM

Breaking News

హరీష్ నాయక్ కుటుంబానికి ఎంపీ ‘వేం’ పరామర్శ   •   రాష్ట్ర మహా సభల గోడ పత్రికల ఆవిష్కరణ   •   పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •   గద్వాల మార్కెట్ యార్డులో గంజాయి పట్టివేత..!   •  

చంపాపేట డివిజన్ ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక

31-08-2026 09:46 AM

ఎల్బీనగర్, ఆగస్టు 29: బహుజనుల హక్కుల కోసం ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని పలువురు నాయకులు అన్నారు.  మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు చంపా పేట్ డివిజన్ అంబేద్కర్ వాడలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు.

అధ్యక్షుడిగా ఎస్.బీసన్న మాదిగ, ఉపాధ్యక్షుడిగా మహేశ్ మాదిగ,  కార్యదర్శిగా సుంకన్న, కమిటీ సభ్యులుగా రమేశ్, భాస్కర్, సుధాకర్,  కిరణ్, పరశురామ్, సుధాకర్, అశోక్, రాజు, చింటూ, ప్రవీణ్, రూపేష్, కాశీం తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి  ఎల్బీనగర్ నియోజకవర్గం మాజీ ఇన్ చార్జి సుధాకర్ మాదిగ,  నాయకులు మల్లెపోగు రాజు మాదిగ, నర్సింహా మాదిగ, సురేశ్ మాదిగ, నర్సింగ్ రావు మాదిగ, పైగల రావు మాదిగ, దుబ్బ శీను మాదిగ, నాగరాజు మాదిగ, భాస్కర్ మాదిగ  తదితరులు పాల్గొన్నారు.